తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  మణికొండ–నెక్నంపూర్ డివిజన్లలో ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు అందె లక్ష్మణ్ రావు తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు కాపాడు కోవడం, సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలో పోలింగ్ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఓటర్లు తమకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను బీఎల్‌వోల వద్ద పొందడంతో పాటు, 2002 సంవత్సరానికి సంబంధించిన తమ లేదా తమ పూర్వీకుల ఓటరు వివరాలను సమర్పించి ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి మ్యాపింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. మొదట జూలై 24, అనంతరం ఆగస్టు 3 వరకు గడువు ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించ లేకపోయిన ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 10 వరకు పొడిగిం చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సహాయ శిబిరాల ద్వారా స్థానిక ప్రజలకు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సేవలను ఆగస్టు 10 వరకు కొనసాగిస్తామని, మణికొండ, నెక్నంపూర్ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటామని పేర్కొన్నారు. అవసరమైన వారు 8297003033 నంబర్‌లో సంప్రదించవచ్చని అందె లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుట్టమీది నరేందర్, సుమనలిని, షేక్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.