తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ లోని ప్రధాన కూడళ్లలో అధ్వాన్నంగా మారిన రహదారులపై కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, కాలనీలలోని రోడ్లన్నీ అధ్వాన్నమై గుంతల మయంగా మారాయని, జిహెచ్ఎంసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల బిఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని, రోజూ ప్రధాన రహదారులపై ప్రయాణిస్తున్న లక్షలాది వాహనదారులు శారీరక వేదన అనుభవిస్తున్నారని, వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఆర్థికంగా, మానసికంగా నానా అవస్థలు పడుతున్నారని ఐటీ కారిడార్ కి తలమానికమైన కొండాపూర్‌లో రోడ్ల పరిస్థితి ఈ స్థాయిలో దిగజారడం అధికారుల నిర్లక్ష్య పరిపాలనకు అద్దం పడుతుందని అన్నారు. తక్షణమే మరమ్మత్తులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని కొండాపూర్ డివిజన్ లో శాశ్వత పరిష్కారదిశగా రోడ్డు పనులు ప్రారంభించాలని రాబోయే మూడు నుంచి ఐదురోజులలో రోడ్ల పరిస్థితిలో మార్పు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను వాహనదారులను ఏకంచేసి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ముట్టడి కార్యక్రమం చేపడతామని, ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి రోడ్ల మరమ్మత్తులను తక్షణమే పూర్తిచేయకపోతే ప్రజలకు జరిగే నష్టాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్  కుమార్, డాక్టర్ పసుపునూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.