తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాంభాగ్‌లోని దుర్గామాత మందిరంలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమారెడ్డి దుర్గమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఉమారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుష్ప, నాగమణి, శమంతా, సరిత, చిన్న భారతి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
