తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో ఆషాఢ బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, బుద్వేల్, మధుబన్ కాలనీ, పద్మశాలిపురం ప్రాంతాల్లో బోనాల పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాలను సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.