తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి కాలనీ లేఅవుట్‌ లోని మౌలిక సదుపాయాల సమస్యలను వారికి వివరించారు. అసోసియేషన్ సభ్యులు మౌలిక సమస్యలను వివరించిన వెంటనే ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించి, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి స్వయంగా పాదయాత్ర చేపట్టి కాలనీ లేఅవుట్‌ను పూర్తి స్దాయిలో సందర్శించారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ లేఅవుట్‌ లో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను స్యయంగా పరిశీలించారు. ఈ క్రమంలో స్థానికులు లేఅవుట్‌లో పార్కుల అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, త్రాగునీటి పైప్ లైన్ , వీధి దీపాలు తదితర మౌలిక అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. లేఅవుట్ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతు, ప్రజల న్యాయమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, కాలనీ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీఇచ్చారు. ఈ సందర్బంగ మల్లు ప్రసాద్, ప్రభాకర్, చక్రపాణి నవీన్, వెంకట్, మహేష్ కుమార్, జయంతి, జగదీష్,,ఫణి, భాస్కర్, మోహన్, గౌరిశంఖర్, వెంకటయ్య, నరసింహా రావు, మల్లేష్, అంజిరెడ్డి, లక్ష్మిపతి , తపాడియా, శ్రీకాంత్, క్రిష్ణ , స్థానికులు లేఅవుట్‌ను స్వయంగా సందర్శించి, సమస్యలను ఓపికగా విన్నందుకు, అలాగే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల మెరుగుదలపై శ్రద్ధ చూపినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలిపారు