తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో మండలం రేఖ్యతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాత్లావత్ లక్ష్మి శ్రీధర్‌తో పాటు వార్డు సభ్యులు లలిత, శ్రీను, ఎస్. విజయ, కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం కడ్తాల్ మండల ముఖ్య నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైదాబాదులోని ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, శ్రీను, గంగులు, సోమ్లా, దాస్య, రమేష్, రవి, గణేష్, నరేష్, పాండు, కిరణ్, వాసు, హరి, వినోద్, పవన్, శ్రీధర్‌తో పాటు మండల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.