తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  జంగమ్మటలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి రేపు పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పార్వతాల రాజేందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది కూడా కళాకారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపును వైభవంగా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.