తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పగిడిమర్రి సూర్యనారాయణ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తి, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్వ సత్యనారాయణ, గద్దె కృష్ణ, శ్రవణ్ కుమార్, పి. వాసు, గద్దె యాదగిరి, వీడేం రమేష్, యాదగిరి భాస్కర్, నరేందర్, సూరజ్, ఉమాదేవి, పద్మ, ప్రసన్న, మల్లిక తదితరులు పాల్గొన్నారు.