తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం టాగోర్ ఆడిటోరియంలో ఈ శిక్షణా కార్యక్రమం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 630 మంది మండల విద్యాశాఖ అధికారులుతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్యా సంచాలకులు పాల్గొననున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్యా సంచాలకులు తమ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులతో కలిసి ఉదయం 9:30 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు..సంబంధిత అధికారులు తప్పనిసరిగా శిక్షణా కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు, సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు డా. ఈ. నవీన్ నికోలస్, ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు
