తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మిరియాల ప్రీతమ్ పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు, ఆదిత్య, బాలరాజు, మల్లేష్, మహేష్, చందు కార్యనిర్వాహకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
