తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్  : హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర
బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణి రాజేంద్రనగర్, ఆగస్టు 10 ( వార్త వేదిక సూర్య ) : ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరగూడ పరిధిలోని ప్లెజెంట్‌ పార్క్, న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ ప్రాంతాల్లో మహిళలు తిరంగయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ జాతీయ జెండాను తీసుకెళ్లి, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ మహిళలు ఉత్సాహంగా తిరంగయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య, రేణుక, కిరణ్, ప్రణీత రెడ్డి, సుజాత, భావన, కళ, అనురాధ, అనిత తదితరులు పాల్గొన్నారు.