తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,
మియాపూర్ డివిజన్, బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్‌లో నిర్వహించిన బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాల్లో రాచమల్ల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ మరియు మియాపూర్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. మియాపూర్‌కు చెందిన ప్రముఖులు రాచమల్ల కుటుంబ సభ్యులు అందించిన ఆహ్వానం మేరకు మహోత్సవాలకు హాజరైన నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాలు తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు మియాపూర్ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవాల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని, భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల కుటుంబ సభ్యులు,నల్ల సంజీవ్ రెడ్డి,వీరేంద్ర గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, రాంచందర్,రవి కుమార్, శ్రీదేవి,నర్సింగ్,కామినేని వాసు,వంశీ, ప్రవీణ్, నాగసాయి, సతీష్,వినోద్, రత్నాచారి, స్థానికులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.