తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగ లేఅవుట్‌లోని పార్కుల అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, త్రాగునీటి పైప్ లైన్ , వీధి దీపాలు తదితర మౌలిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం, లేఅవుట్‌ లోని మౌలిక సమస్యలను వ్రాత పూర్వకంగా అందజేశారు. అసోసియేషన్ సభ్యులు మౌలిక సమస్యలను వివరించిన వెంటనే ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ప్రజల న్యాయమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, కాలనీ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ప్రభాకర్, చక్రపాణి నవీన్, వెంకట్, మహేష్ కుమార్, జయంతి, జగదీష్,,ఫణి, భాస్కర్, మోహన్, గౌరిశంఖర్, వెంకటయ్య, నరసింహా రావు, మల్లేష్, అంజిరెడ్డి, లక్ష్మిపతి , తపాడియా, శ్రీకాంత్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు