తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారాలలో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామికి వేదశాస్త్ర, పండిత శ్రేష్టులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 11వ తేదీ మంగళవారం వేకువఝాము నుండి దేవాలయంలో భక్తజనుల సందడితో కళకళ లాడుతూ పండుగ శోభను విరజిమ్ముతూ అత్యంత వైభవోపేతంగా దీప కాంతులతో వెలుగొందుతు, ఆహ్లాద వాతావరణాన్ని కలిగిన దేవాలయ ప్రాంగణమంతా భక్తులకు నూతన ఉత్తేజాన్ని నింపుతుండటంతో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తజనులు ఆధ్యాత్మికతను ఆస్వాదించారు. శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దర్శనార్ధమై విచ్చేసిన భక్త జనులందరికీ దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ స్వయంగా తన అమృత హస్తాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతు, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అత్యంత వైభవంగ తీర్చిదిద్ది, భక్తజనులకు శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేస్తున్న ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నామని అన్నారు.