తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శిల్పా గార్డెన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 8,9వ వారాంతపు తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శిల్పా గార్డెన్స్ ఫ్రీడమ్ కప్ 2026క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఈ క్రీడా వేడుకల్లో కాలనీలోని ప్రతి ఒక్క కుటుంబం పాలుపంచుకుని విశేష ఆదరణ అందించాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆటల్లో పాల్గొనడమే కాకుండా, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పండగ వాతావరణాన్ని తలపించారు. పోటీల ముఖ్యాంశాలు చిన్నారులు, యువత, కిడ్స్ క్రికెట్ పోటీల్లో పిల్లల ఆటతీరు కాలనీ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. యువత మరియు చిన్నారులు పూర్తి క్రీడాస్ఫూర్తితో ఆడుతూ మ్యాచ్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల భాగస్వామ్యం గృహిణులు, తల్లులు తమ దైనందిన జీవన శైలికి కాస్త విరామం ఇచ్చి ఖో-ఖో, త్రో బాల్ పోటీల్లో మైదానంలో దిగి అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విభాగం పురుషులకు నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ మరియు క్యారమ్స్ పోటీలు ఎంతో పోటీతత్వంతో, రసవత్తరంగా సాగాయి. కాలనీ పెద్దల సందేశం, ఈ పోటీల్లో కేవలం గెలుపోటములు మాత్రమే కాకుండా, కాలనీ కుటుంబాల మధ్య అనుబంధాలు, మైత్రి, ఆరోగ్య స్పృహ పెరగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆగస్టు15వ తేదీ జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతుల ప్రధానం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ క్రీడల విజయవంతమైన నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు కవరేజ్ అందించిన విలేఖరులకు శిల్పా గార్డెన్స్ సంక్షేమ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
