తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలోని సీనియర్ మహిళా సంఘ సేవకురాలైన శ్రీమతి జంపని సుజాతకు గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో మన అమరావతి థీమ్‌తో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక స్టేట్ ఐకాన్స్అవార్డ్స్ 2026కార్యక్రమం విజయవాడలోని హయత్ ప్లేస్‌లో ఘనంగా నిర్వహించిన సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను ఘనంగా సత్కరించి 2026అవార్డులు ప్రదానం చేసిన కార్యక్రమంలో ఘనంగా అవార్డు ప్రదానంచేసారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డా. ఎస్. వేణుగోపాలాచారి, టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ అధ్యక్షులు చైతన్య జంగా, వైస్ ప్రెసిడెంట్ మిత్తాన ఈశ్వర్, సినీ నటి నైనా గంగూలీ పాల్గొని జంపని సుజాతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు.
