తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో కాలనీవాసుల పిలుపుమేరకు పలు సమస్యలపై పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి సంబంధించి అవుట్లెట్ మరియు మ్యాన్ హోల్స్ నిర్మాణం కోసం పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు సూచించిన సమస్యలకు స్థానిక శాసనసభ్యులు అరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం చూపుతానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.