తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జెప్టో రవాణా సంస్థతో కలిసి పనిచేస్తూ బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్‌కు సంస్థ తరఫున మొదటి బహుమతి, అవార్డు లభించింది.రవాణా రంగంలో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈరంకి వేణు కుమార్ గౌడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోనూ రవాణా రంగంలో విశేషంగా సేవలందిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించారు ఈ సందర్భంగా ఈరంకి వేణు కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జెప్టో సంస్థతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచి మొదటి బహుమతి అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు. రవాణా రంగంలో తమ ఉద్యోగులు చూపిస్తున్న ప్రతిభ, కష్టానికి లభించిన ఫలితమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ఉద్యోగుల కృషి, సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన తెలిపారు.
