తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,
నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి ఘనంగా బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు నైవేద్యముగా ఉండి అన్న ప్రసాదాలు భక్తులకు సమర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు కార్యక్రమంలో శేరలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు నందన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలి అందరూ ఐక్యమత్యంతో ఆనందంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దయాకర్ యాదవ్, కాలనీ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలి సకాలంలో వర్షాలు పడాలి పాడిపంటలు బాగుండాలి అందరూ ఆయురారోగ్యం ఉండాలి విద్యార్థులు చదువులో రాణించాలి వ్యాపార ఉద్యోగ రంగాల్లో అందరు దిరిదిన అభివృద్ధి చెందాలని అమ్మ వాళ్ళని వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపినారు. ప్రతి ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అమ్మవారి వేడుకున్నారు. సాయిబాబా ఆలయ ప్రధానార్చకులు జోషి రాఘవేంద్ర శర్మ, కే నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, అన్నదొర, యోగా గురువు గారెల వెంకటేష్ ముదిరాజ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, సత్యమ్మ, మని మేఘమాల, చిట్టెమ్మ, లాల్ రెడ్డి, శారద, రాధా రాణి రెడ్డి, జయ రెడ్డి, గంగమ్మ, రేణుక, శాంతాబాయి నాయక్, మనోజ్ కొత్త ముదిరాజ్, అంజిరెడ్డి, రాములు నాయక్, బాలరాజ్ నాయక్,కుమార్ నాయక్, బిమ్లా నాయక్ యశోద నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, ప్రమోద్ నాయక్, సాయి కుమార్ నాయక్, మల్లేష్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సంతోష్ కుర్మా, మహేష్ కురుమ, బేరి శ్రీనివాస్ యాదవ్ యాదయ్య కుర్మా, శీను కురుమ, యువత డిజే బువన్, రాజు, లవణాచారి, కమల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజన్, సేవాదళ్ నాయకుడు నర్సింగ్ రావ్, పాల్గొని విజయవంతం చేశారు.