తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు మరియు ఇతర అధికారులను కలిసి ఏర్పాట్లు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
