తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్వామి వివేకానంద యోగ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు భద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా యోగ గురువు భద్రయ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత దేశ సేవ, సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద యోగ సేవా సమితి సభ్యులు, యోగా సాధకులు, క్రీడాకారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.