తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ ఆదర్శ కాలనీలో శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశభక్తి, ఐక్యత, సేవా భావంతో ముందుకు సాగాలని నిర్వాహకులు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి పొదుపు సంఘం కమిటీ ప్రతినిధులు, సభ్యులు, స్థానికులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
