తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట జగదీష్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏర్వ సత్యనారాయణ, గద్దె కృష్ణ, గద్దె యాదగిరి, మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విడం రమేష్, నవోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట పవన్ కుమార్, వర్కల చందు, తిరునగర్ లక్ష్మణ్, మామిడి శెట్టి శ్రీనివాస్, కోట శ్యాం కుమార్, ధనంజయ, సురేష్, భాస్కర్, భానుచందర్, శివ, లింగం, విజయ్, సంతోష్‌తో పాటు చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
