తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజీవ్ గృహకల్ప ఫేజ్-1లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మైలార్ దేవుపల్లి మాజీ కార్పొరేటర్ టి. ప్రేమ్ దాస్ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలందరూ సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. ప్రేమ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ధనంజయతో పాటు కాలనీవాసులు జి. తిరుపతి గౌడ్, ఎన్.కె. శంకర్, శరణమ్మ, రాధారెడ్డి, శ్రీనివాస్ నాయక్, జాంగిర్ బాయ్, చంద్రశేఖర్, గాడేపల్లి లక్ష్మణ్, బండారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
