తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రయ కాలనీలో నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా చేయించుకోవలసిన ఎంక్వైరీ ప్రక్రియను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల ఆగస్టు నెలనుండి ఆన్లైన్ విధానం ద్వారా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారు తప్పనిసరిగా ఎంక్వైరీ ని పూర్తిచేసుకోవాలని అన్నారు. ఎంక్వైరీ కొరకు మీ దగ్గరలోని శంషిగూడ వార్డ్ ఆఫీస్, దత్తాత్రయ కాలనీ సాయిబాబా టెంపుల్ , అల్విన్ కాలనీ ఫేస్ 2 కామ్యూనిటీ హల్ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు సమర్పించిన అన్ని పత్రాలను స్వయంగా తీసుకునివెళ్ళి ఎంక్వైరీ విధానాన్ని పూర్తిచేసుకోవాలని తెలియచేశారు. ఎంక్వైరీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత నూతనంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్ త్వరలో వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఓ. ముస్తఫా, బిఎల్ఓ లు, బిఎల్ఎ లు తదితరులు పాల్గొన్నారు.
