తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : యాదగిరినగర్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నూతన బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ చొరవతో, ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు స్టేట్ స్పెషల్ ఫండ్స్ ద్వారా ఈ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో బోర్‌వెల్ పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఆలయానికి నీటి సౌకర్యం కల్పించేందుకు బోర్‌వెల్ పనులు చేపట్టడంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శదమని శంకర్, మనోహర్, రాజు, రమేష్, సుజాత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.