తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కార్వాన్‌కు చెందిన ప్రముఖ ఫోటో, వీడియో గ్రాఫర్ బిజ్జ విజయ్‌కుమార్ ప్రతిష్ఠాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’కు ఎంపికయ్యారు. ‘బెస్ట్ ట్రెడిషనల్ వీడియో గ్రాఫర్’ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవంతో పాటు, సాంప్రదాయ ఫోటోగ్రఫీలో తనదైన విశిష్ట శైలిలో సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజయ్‌కుమార్ తన వృత్తి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన విజయ్‌కుమార్‌కు ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులు, స్నేహితులు, బంధువులు మరియు అభిమానులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
