తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నల్లగండ్ల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ను స్థానిక అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతు, ప్రజాసమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు.
