తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఈ నెల 23 న ఆదివారం నిర్వహించనున్న యువ సమ్మేళనం సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణతో పాటు సంఘటిత శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, సమాజ అభివృద్ధికి ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.