తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి శుక్రవారం తన నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు పసుపు, బొట్టు అందజేసి వరలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని ఆమె తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.