తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. అలాగే మియాపూర్ డివిజన్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ కార్యక్రమంలో పాల్గొని, దంపతులను ఘనంగా సత్కరించి, వారి షష్టిపూర్తి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గిరి, అశోక్, కట్ల శేఖర్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, శేఖర్ ముదిరాజ్, మూర్తి, భాగ్యలక్ష్మి, అనిత, శాంత, సంగీత, ప్రవీణ్, శశి తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ షష్టిపూర్తి మహోత్సవం దంపతుల జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతత మరియు సుఖ సంతోషాలతో నిండిన మరెన్నో వసంతాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తు శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ కు షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలిపారు.
