తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమంటి కృష్ణ , వీరశైవ లింగాయత్ ఆర్గనైజర్స్ ప్రతినిధులు తదితరులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొనవలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సమావేశంలో ఆల్విన్ కాలనీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్వారీ శశిధర్, ప్రభాకర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
