తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ను కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి సామ రామమోహన్ రెడ్డి నల్లగండ్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతు, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్ర ఓటరూ తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మీ ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంలో కీలకం అని,నేటి నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థుల విధానాలు,పనితీరు,పట్టభద్రుల సమస్యలపై వారి వైఖరిని పరిశీలించి అభ్యర్థికి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నేపల్లి సాంబశివ రావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ సోదరులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు, సోదరీమణులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్యుఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
