రూ.26.50 లక్షలకు లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు దక్కించుకున్న లక్ష్మీ నరసింహులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, చుక్కాపూర్‌లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయించేందుకు ఆలయ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకులు సత్యనారాయణ పర్యవేక్షణలో రెండు సంవత్సరాల కాలపరిమితికి ఈ బహిరంగ వేలం నిర్వహించారు.

ఈ వేలం పాటలో కూడవెళ్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహులు రూ.26 లక్షల 50 వేలకు అత్యధికంగా పాట పాడి లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులను దక్కించుకున్నారు.
గత సంవత్సరం ఇదే ప్రసాదాల విక్రయ హక్కులు రూ.17 లక్షల 20 వేలకు వేలం ద్వారా దక్కగా, ఈసారి రూ.9 లక్షల 30 వేల మేర అదనంగా ఆదాయం సమకూరింది. దీంతో ఆలయానికి గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా అధిక ఆదాయం లభించింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరాం రవీందర్ గుప్తా, అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు రాజారెడ్డి, లక్ష్మీరాజం, దేవయ్య, ఆంజనేయులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు పాల్గొన్నారు. వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
