తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చింతల్‌మెట్ గ్రామంలోని శ్రీ హస్తాల వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.
పురాతన ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆలయ పరిరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆలయానికి సంబంధించిన స్థలాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులు కోరారు. ఆలయ పరిశుభ్రత, పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు స్థానికుల సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేశం నర్సింగ్ యాదవ్, తండ రాజు గౌడ్, బండకృష్ణ యాదవ్, మహేష్ గౌడ్, కాశీనాథ్, శ్రీను, ఉమేష్ రెడ్డి, శ్రీకాంత్ (లంబు), ఎం. మహేందర్, నరేష్, రంగస్వామి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
