• జై మార్కండేయ 🙏 | జై పద్మశాలి 🙏
• పద్మశాలి నేతన్నకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి నేతన్నకు ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్ కోరారు.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పద్మశాలి బిడ్డకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. పద్మశాలి సమాజానికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ సీటును కన్‌ఫర్మ్ చేయాలని మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వనమాల శంకర్, తీరాందాసు ధనుంజయ, పొలిటికల్ కన్వీనర్ గుంటి నాగేష్, సెక్రటరీ గుంటుక మహేష్, GHMC యువజన అధ్యక్షులు ఆడెపు సంతోష్, కార్యదర్శి ఇరుకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Avatar photo

By Murthy