తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్:
ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన మన పద్మశాలి ముద్దుబిడ్డ లు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుందారపు ఉమామహేశ్వర్ జిల్లా కోశాధికారిగా గోనె శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కరీంనగర్ జిల్లా పద్మశాలి పరసన్నిధి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రిటైర్డ్ ఆర్డీఓ కుందారపు ఉమామహేశ్వర్, జిల్లా కోశాధికారిగా గోనె శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పరసన్నిధి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ.. సమాజ సేవలో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు రెడ్ క్రాస్ సొసైటీ వంటి సేవా సంస్థల్లో బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలకు సేవలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు.
నూతనంగా ఎన్నికైన కుందారపు ఉమామహేశ్వర్, గోనె శ్రీనివాస్‌లకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి పరసన్నిధి సేవా సమితి సభ్యులు ఎలిగేటి శ్రీనివాస్, గజవెల్లి కనకయ్య, తడిగొప్పుల రవీందర్, ఆడెపు మునీందర్, మంచాల మోహన్ , పిస్క లక్ష్మీనారాయణ, ఎలిగేటి కిషన్, కొక్కుల గోవర్ధన్, కొక్కుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
