తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,మదీనగూడ డివిజన్ పరిధిలో గంగారం హుడాకేఫ్, మంజీరా రోడ్ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలుచేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ప్రజలందరిపై శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రినాధ్, పరదేశి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.