తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,
మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ఎస్బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ఎస్బీ జీఎం. కృష్ణ , శేరిలింగంపల్లి నియోజకవర్గ డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, పెండింగ్ లో ఉన్న మంచినీటి పైప్ లైన్ పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైన ప్రాంతాలలో బూస్టర్లను ఏర్పాటు చేయాలని, అసంపూర్తిగా ఉన్న యూజీడీ పనులు, చేపట్టవలసిన పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం, తక్కువ ప్రెజర్ తో నీరు రావడం వంటి సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, గోపి నగర్, నెహ్రూనగర్, తారానగర్ పలు ప్రాంతాల్లో యూజీడీ, మంచినీటి కొత్త లైన్ వేయాలని, పెండింగ్ మ్యాన్ హోల్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్ ఎస్బీ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు పురం విష్ణువర్ధన్ రెడ్డి, తదితర ముఖ్యనాయకులు, కాలనీపెద్దలు తదితరులు పాల్గొన్నారు.