తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కర్మన్‌ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ”ఆధ్యాత్మిక భక్తితో శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతు, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించినట్లుగా తెలిపారు.