తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, సీఎమ్సీ కమిషనర్ శ్రీమతి సృజన ,జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ , ఇతర సీఎమ్సీ అధికారులతో కలిసి మదీనాగూడ డివిజన్‌లోని మైత్రి నగర్ పార్క్ నందు కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలతో కలిసి వన్ డే , వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మదీనాగూడ, హఫీజ్‌పేట్ డివిజన్లకు చెందిన కాలనీ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులతో వన్- టు-వన్ సమావేశం నిర్వహించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీలోని పౌర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.