తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్-20 పరిధిలో ఆగస్టు 27, 2026 నుంచి వార్డు సభలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఓటరు నోటీసు అందుకున్న వారు సంబంధిత కేంద్రాలకు వెళ్లి తమ ఓటరు వివరాలను వెరిఫై చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.వెరిఫికేషన్ కేంద్రాల్లో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటరు నోటీసు అందుకున్న వారు తప్పనిసరిగా సంబంధిత కేంద్రానికి వెళ్లి తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ కేంద్రాలు అంగన్‌వాడీ స్కూల్, బుద్వేల్, మహిళా భవనం, కాటేదాన్ నూరారీ మసీదు, హసన్ నగర్, ప్రభుత్వ పాఠశాల, బాబుల్ రెడ్డి నగర్, అక్బర్-ఏ-మసీదు, హసన్ నగర్, అత్తాపూర్ సర్కిల్ కార్యాలయం, హైదర్‌గూడ వార్డు కార్యాలయం,.ప్రభుత్వ పాఠశాల, చింతల్‌మెట్, ఓటరు వివరాల పరిశీలన ప్రక్రియలో ప్రజలు సహకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు.
