మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా పలువురు ప్రజలను కలిసి మట్టి గణపతుల ప్రతిష్ఠాపన ప్రాధాన్యతను, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, పర్యావరణ హితమైన విధానాలను పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్బంగ యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతు, మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం. పర్యావరణ పరిరక్షణను మన బాధ్యతగా స్వీకరించి, మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకుందాం అన్నారు.