తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో “ఆత్మహత్యల నివారణ లో మన పాత్ర” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితం లో సమస్యలనేవి చాలా సర్వసాధారణం అని వాటిని పరిష్కరించుకునే దారి చూసు కోవాలి కాని సమస్యల నుండి పారిపోవడానికి ఆత్మహత్యల వైపు వెళ్లకూడదని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. జీవితంలో సమస్యలు వచ్చాయని జీవితాన్ని ముగించాలని ఆత్మ హత్య చేసుకోవడం అవివేకం, వయస్సు సహకరించకపోయినా అవయవాలు సహకరించక పోయినా కూడా ఎంతో మంది జీవితాలను కొనసాగిస్తున్నారు ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకు తున్నారు.. అమ్మ, నాన్న తిట్టారని, టీచర్ కొట్టారనో, ప్రియులు దూరమయ్యారనో, మార్కులు తక్కువ వచ్చాయనో, మరెన్నో కారణాల చేత ఆత్మహత్యలు చేసుకోకండి. పైకి వచ్చిన వారంతా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే పైకి వచ్చారు. పిరికితనం వదిలి పోరాడటం నేర్చుకోండి, సమస్య ఉంది అంటే పరిష్కారం ఉందని అర్థం, మన జీవితాన్ని మనం ప్రేమించి గౌరవించి నప్పుడే అందంగా మలచుకోగలం, అర్థాంతరంగా ముగించాలను కుంటే ఎవరికి నష్టము మీకు మీపై ఆదారపడిన వారికే ఆగి ఆలోచించండి జీవితం చాలా అందమైనది తోటివారు భాధలో ఉన్న కష్టములో ఉన్న చేయి కలుపుదాం మనము ఉన్నమన్న దైర్యాన్ని భరోసాని అందిద్దాం.. ఆత్మహత్యలను నివారిద్దం అని డాక్టర్ అనితా రెడ్డి మహిళలకు తెలియచేసారు, స్వధార్ లో ఆశ్రమంలో వివిధ సమస్యలతో వచ్చేవారు ఆశ్రయం పొందుతారని మానసికంగా బలహీనమైన మనస్సు తో ఉంటారని అందుకే నిత్యము కౌన్సిలింగ్ చేస్తూ వారిని ధృడంగా, దైర్యవంతులుగా చేసి, వారి సమస్యలను వారే పరిష్కరించుకునే చేసి, స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పిస్తూ ఆర్థికంగా అభివృద్ధి పరుస్తామని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, స్వధార్ నిర్వాహకురాలు శైలజ ,కమల, సంధ్య మహిళలు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy