తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకల్లో స్థానిక ప్రజలు కమిటీ సభ్యులు , యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.