తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ అమ్మ భగవాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణు గోపాల్ గౌడ్ నేతృత్వంలో శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తజనులకు అన్న ప్రసాదాలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన సందర్బంగ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ విచ్చేసి శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తజనులకు అన్న ప్రసాదాలను అందజేసారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు.
