తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : టీ ఎన్జీవోస్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా జరిగింది. వేలంపాటలో పోతు రంజిత్ కుమార్ రూ.21,516లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు రంజిత్ కుమార్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అనంతరం లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా పోతు రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. గణపతి లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.