తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ ఆర్జీకే ఫేజ్-2లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలంపాట ఉత్సాహంగా జరిగింది. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలంపాటలో ఉత్సాహాన్ని కనబరిచారు.
వేలంపాటలో సాయి అన్నల శ్రీనివాస్ రూ.1,30,000లకు ఒక లడ్డూను కైవసం చేసుకున్నారు. మరో లడ్డూను గంగారం శంకర్ రూ.53,001లకు దక్కించుకున్నారు.

లడ్డూలను దక్కించుకున్న వారిని నిర్వాహకులు అభినందించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.