తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : లక్ష్మిగూడ ఆర్‌జీకే ఫేజ్–2లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలంపాట పోటాపోటీగా జరిగింది. ఈ వేలంపాటలో శ్రీనివాస్ రూ “.1,30,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.

అనంతరం కమిటీ నిర్వాహకులు శ్రీనివాస్  ను శాలువాతో సత్కరించి, లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్  మాట్లాడుతూ… వినాయకుడి ఆశీస్సులతో లడ్డూను దక్కించు కోవడం ఆనందంగా ఉందని తెలిపారు. యువత ఐక్యతతో భక్తి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయ మన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.