తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  లక్ష్మిగూడ ఆర్‌జీకే ఫేజ్–2లో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలంపాట పోటాపోటీగా జరిగింది. ఈ వేలంపాటలో సైయానోళ్ల బాలరాజ్ రూ.1,30,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.

అనంతరం కమిటీ నిర్వాహకులు బాలరాజ్‌ను శాలువాతో సత్కరించి, లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో లడ్డూను దక్కించు కోవడం ఆనందంగా ఉందని తెలిపారు. యువత ఐక్యతతో భక్తి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీ యమన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.